FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..

|

Oct 28, 2024 | 10:37 AM

శనివారం రాత్రి జన్వాడలో జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరక్కపోయినా.. విజయ్‌ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్‌ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..
Janwada Farm House Case
Follow us on

జన్వాడలో శనివారం రాత్రి జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరక్కపోయినా.. విజయ్‌ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్‌ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఎక్కడున్నారనేది ఇంకా బయకుట రాలేదు. విజయ్‌ని మాత్రం ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాగా.. జన్వాడ పార్టీపై మోకిల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. NDPS యాక్టుతోపాటు.. గేమింగ్‌ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏ1గా రాజ్‌ పాకాల, ఏ2గా విజయ్‌ మద్దూరిని చేర్చారు అధికారులు. ఈ FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌ పాకాలతో ఐదేళ్లుగా విజయ్‌ మద్దూరికి స్నేహం ఉన్నట్టు తెలుస్తోంది. దివాలీ సందర్భంగా కొత్త ఇంట్లో పార్టీకి రాజ్ పాకాల ఆహ్వానించారు. అక్కడ రాజ్‌ పాకాల ఇచ్చిన డ్రగ్స్‌ విజయ్‌ తీసుకున్నట్లు FIR నమోదైంది. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా.. మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. రాజ్ పాకాలకు కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రాయదుర్గంలోని ఒరియన్‌ విల్లాస్‌‌లో ఉన్న రాజ్‌పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లో ఎక్సైజ్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే.. రాజ్‌ పాకాల ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.. జన్వాడ పార్టీలో ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు కేసులో ఏ2గా ఉన్న విజయ్‌ మద్దూరి పార్టీపై కీలక కామెంట్‌ చేశారు. రాజ్‌పాకాల దివాలీ పార్టీ అని ఆహ్వానిస్తేనే వెళ్లానన్నారు. FIRలో తాను చెప్పని మాటలు కూడా రాశారన్నారు విజయ్‌. ఫంక్షన్‌లో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదన్నారు మద్దూరి విజయ్‌.. రాజ్‌ పాకాల డ్రగ్స్‌ తీసుకోమంటేనే తీసుకున్నానని.. తాను స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు పోలీసుల వెల్లడించడం సరికాదన్నారు. FIRలో స్టేట్‌మెంట్‌ తప్పురాశారని, అలా జరగలేదని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..