TS Graduate MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య ప్రకటన చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణి దేవికే తమ మద్ధతు అని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన ఆయన విడుదల చేశారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కేంద్రం తమతో ఉన్నా.. తెలంగాణ బీజేపీ మాత్రం తమపై కుట్రలు చేసిందని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురికే తాము మద్ధతిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ బీజేపీ జనసేనను చులకన చేసి మాట్లాడిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కూతురు వాణి దేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Also read: AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా