బద్దక ఓటర్లకు ఆదర్శంగా నిలిచిన నవ వధువు.. ఓటేసిన తర్వాతే పెళ్లిపీటలెక్కిన ఫిర్దోస్ బేగం

రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటేనే అదో ప్రహసనంలా ఫీలవుతుంటారు. ఇందులో చదువుకున్న ఓటర్ల కంటే చదువుకోని వారే కాస్త నయం..

బద్దక ఓటర్లకు ఆదర్శంగా నిలిచిన నవ వధువు.. ఓటేసిన తర్వాతే పెళ్లిపీటలెక్కిన ఫిర్దోస్ బేగం
Wedding Vote
Follow us
K Sammaiah

|

Updated on: Mar 14, 2021 | 10:59 AM

రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటేనే అదో ప్రహసనంలా ఫీలవుతుంటారు. ఇందులో చదువుకున్న ఓటర్ల కంటే చదువుకోని వారే కాస్త నయం అనుకోవచ్చు. పోలింగ్‌ రోజున ఆఫీసులకు సెలవుదినం కావడంతో ఓటర్లు షికార్లు కడుతుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి బద్దకస్తులైన ఓటర్లకు ఓ యువతి ఆదర్శంగా నిలిచారు. మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు.

మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఫిర్దోస్‌ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు ఉదయం 8.30గంటలకు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత వెంటనే ఆ తర్వాత వెంటనే పెళ్లి కోసం ఫంక్షన్‌‌ హాలుకు బయలుదేరి వెళ్లింది.

ఎన్నికల సమయంలో సెలవు ఉన్నా.. కొందరు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొద్ది సేపట్లో తన వివాహం ఉన్నా.. బాధ్యత కలిగిన పట్టభద్రురాలిగా ఓటుహక్కు వినియోగించుకున్న ఫిర్దోస్‌ బేగంను పలువురు అభినందించారు. ఫిర్దోస్ బేగంను ఆదర్శంగా తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని కోరుతున్నారు.

Read More:

తెలంగాణలో కొనసాగుతోన్న పోలింగ్‌.. ఓటు వేసిన‌ జీహెచ్‌ఎంసీ మేయర్‌, మాజీ మేయర్

వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి విస్తృత పర్యటన. పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకుంటున్న మంత్రి