Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఆదివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.

ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సైతం అన్ని రకాల ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్న అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఆదివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.
Hyderabad Traffic

Updated on: Oct 21, 2023 | 5:41 PM

ఆదివారం (రేపు) తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరగనున్న విషయం తెలిసిందే. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సైతం అన్ని రకాల ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్న అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. లుంబినీ పార్కు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.

ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఇలా..

* ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్‌ మీదుగా అనుమతి ఇవ్వరు.

* ఇతర జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లిస్తారు.

* సికింద్రాబాద్‌ వెళ్లే వాహనాలను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కట్ట మైసమస్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వైపు మళ్లించనున్నారు.

* ఇక సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వైపు మళ్లించనున్నారు.

* ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వైపు మళ్లించనున్నార. అలాగే పంజాగుట్ట, రాజ్‌ భవన్‌ రోడ్డు నుంచి ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్లే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లించనున్నారు.

* ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ క్రాస్‌ రోడ్‌ వద్ద మళ్లిస్తారు.

* నల్లగుట్ట నుంచి బుద్ధ భవన్‌ వైపు వాహనాలను పూర్తిగా అనుమతించరు. ఈ దారిలో వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

* ఇక హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలను అనుమతించరు. ఈ దారిలో వచ్చే వారు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాలి.

* బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్‌ బండ్‌కు వచ్చే వారి కోసం.. స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..