Telangana Corona Bulletin: తెలంగాణలో 1,511 మంది కరోనా పాజటివ్.. మరింత పెరిగిన రికవరీలు..

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,10,681 మంది నుంచి..

Telangana Corona Bulletin: తెలంగాణలో 1,511 మంది కరోనా పాజటివ్.. మరింత పెరిగిన రికవరీలు..
Corona Virus

Updated on: Jun 14, 2021 | 7:59 PM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,10,681 మంది నుంచి సాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 1,511 మందికి పాజిటివ్ అని తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,04,880 లకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,175 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,80,923కి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ బారిన పడి 3,496 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 96.03 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 20,461 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 7, బద్రాద్రి కొత్తగూడెం – 98, జీహెచ్ఎంసీ – 173, జగిత్యాల – 25, జనగామ – 16, జయశంకర్ భూపాలపల్లి – 37, జోగులాంబ గద్వాల – 13, కామారెడ్డి – 5, కరీంనగర్ – 89, ఖమ్మం – 139, కొమరంభీం ఆసిఫాబాద్ – 8, మహబూబ్‌నగర్ – 26, మహబూబాబాద్ – 57, మంచిర్యాల – 46, మెదక్ – 9, మేడ్చల్ మల్కాజిగిరి – 83, ములుగు – 35, నాగర్ కర్నూల్ – 18, నల్లగొండ – 113, నారాయణ పేట – 8, నిర్మల్ – 7, నిజామాబాద్ – 16, పెద్దపల్లి – 88, రాజన్న సిరిసిల్ల – 21, రంగారెడ్డి – 66, సంగారెడ్డి – 18, సిద్ధిపేట – 57, సూర్యాపేట – 54, వికారాబాద్ – 30, వనపర్తి – 24, వరంగల్ రూరల్ – 33, వరంగల్ అర్బన్ – 51, యాదాద్రి భువనగిరి – 41 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Also read:

ఇంగ్లాండ్‌ను ఓడించారు.. WTC Finalకు ముందు తామేంటో చూపించారు.. న్యూజిలాండ్‌ విజయంలో కీలక ఆటగాళ్లు వీరే..