
జూన్ 1వ తేదీ శనివారం నాడు నగరంలోని మొత్తం ఆరు జోన్లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా ఐఎండీ తెలిపింది. శుక్రవారం నగరంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. అయితే గురువారం ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌లో ఉండవచ్చని వెల్లడించింది. హైదరాబాద్‌లో శనివారం వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న కొద్దిరోజుల పాటు వర్షాలు కురిసే పడే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సకాలంలో రుతుపవనాల గురించి IMD అంచనా వేసినందున త్వరలో రెయినీ సీజన్ షురూ అవ్వనుంది. వేసవి తాపంతో అల్లాడుతున్న హైదరాబాద్‌లో రిలీఫ్ కలిగించే వార్తే ఇది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. సాధారణంగా, హైదరాబాద్‌లో వర్షాకాలం జూన్ మధ్య నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. వేసవి వేడి నుండి స్థానికులకు ఉపశమనం లభిస్తుంది. గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 615.4 మిల్లీమీటర్లు దాటి 769.5 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదైంది. నగరం మొత్తం మీద ‘అదనపు’ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోని మండలాల్లో షేక్‌పేట, మారేడ్‌పల్లి, చార్మినార్, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి మండలాల్లో నగర సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..