Hyderabad: ఈ తల్లి ఆవేదన చూసైనా మారండి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండండి..

|

Jul 21, 2024 | 4:14 PM

ఎలాగైనా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వాలి. అందుకోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. దిక్కుమాలిన రీల్స్‌ కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. సరాదాగా ఉండాల్సిన రీల్స్‌ ప్రాణాలనే తీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న అన్వేకామ్‌దార్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్స్‌ చేస్తూ జలపాతంలో పడి మరణించింది. ఇన్‌స్టాలో భారీగా ఫాలోవర్స్‌....

Hyderabad: ఈ తల్లి ఆవేదన చూసైనా మారండి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండండి..
Hyderabad
Follow us on

ఎలాగైనా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వాలి. అందుకోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. దిక్కుమాలిన రీల్స్‌ కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. సరాదాగా ఉండాల్సిన రీల్స్‌ ప్రాణాలనే తీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న అన్వేకామ్‌దార్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్స్‌ చేస్తూ జలపాతంలో పడి మరణించింది. ఇన్‌స్టాలో భారీగా ఫాలోవర్స్‌ ఉన్న ఈ అమ్మాయి వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఈ విషాధం మరవకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది.

రీల్స్‌ కోసం బైక్‌ స్టంట్‌ చేస్తూ నిండు ప్రాణాన్నే కోల్పోయాడు ఓ యువకుడు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై అంబర్‌ పేట వద్ద వర్షంలో బైక్‌పై ఇద్దరు ఫ్రెంట్స్‌ స్టంట్‌ చేశారు. దీనంతటినీ మరో యువకుడు స్మార్ట్‌ ఫోన్‌లో షూట్‌ చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బైక్‌ అదుపుతప్పింది. స్కిడ్ కావడంతో బైక్‌ కింద పడింది. దీంతో ఇద్దరూ కింద పడ్డారు. అక్కడే ఉన్న స్నేహితులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ శివ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బైక్ నడుపుతున్న యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

చేతికొచ్చిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడంలో శివ తల్లి గుండెలవిసేలా రోదించింది. తలను నేలకు బాదుకుంటూ ‘నా కొడుకు చనిపోయాడా’ అంటూ ఆమె పడ్డ వేదన చూస్తుంటే గుండె బరువెక్కడం ఖాయం. తమకు అండగా ఉంటాడని కోటి ఆశలతో ఉన్న పేరెంట్స్‌ని చీకట్లోకి నెట్టేసిందీ రీల్స్‌ సరదా. ఆ తల్లి దు:ఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు.


సోషల్‌ మీడియాలో లైక్స్‌, ఫాలోవర్స్‌ పెరగాలన్న ఉద్దేశంతో ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా ఇలాంటి వారి తీరు మాత్రం మారడం లేదు. అయితే దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరాదా కోసం చేసే పనులు కుటుంబ సభ్యుల్లో తీరని దుఃఖానికి దారి తీస్తున్నాయి. ఈ రీల్స్‌ పిచ్చికి చెక్‌ పడాలంటే నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్‌ చేసే వారిపై చట్ట పరంగా శిక్షించే విధంగా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఇక యువకుడి తల్లి పడుతోన్న ఆవేదన చూసిన కొందరు కనీసం తల్లిదండ్రుల కోసమైనా ఇలాంటి పిచ్చి వేయడం మానేయాలని, ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని చెబుతున్నారు.


మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..