ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..? డస్ట్ బిన్ వరకు వెళ్లే ఓపిక లేక రోడ్డంతా డస్ట్ చేస్తున్నారా? ఖాళీ జాగాలో పడేసేందుకు చెత్తను చాటుగా తీసుకెళుతున్నారా ? హమ్మయ్య ఎవరూ చూడలేదని చేతులు దులుపుకుంటున్నారా? అయితే మీ పనైనట్లే. సమీపంలోని నిఘా కెమెరాలు లేదా వ్యక్తులు ఫోటోలు తీస్తారు. వెంటనే అక్కడ వేసిన మొత్తం చెత్తను మున్సిపల్ సిబ్బందితో తీయించి సంబంధిత యజమాని ఇంటి ముందు వేసి నిరసన వ్యక్తం చేస్తారు. కుత్బుల్లాపూర్ మున్సిపాల్టీలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూరారం కాలనీ కి చెందిన సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్. పబ్లిక్ ప్లేసుల్లో చెత్త వేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఖాళీ ప్రాంతాలలో చెత్త వేస్తున్నవారిని గుర్తించి, వారితోనే తిరిగి ఆ చెత్తని చేతి సంచులలో నింపి పంపించారు. సూరారంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో కాలనీ అంతా అపరిశుభ్రంగా తయారైంది. దీంతో ఎవరు వేసిన చెత్తను వారే ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో పరిశరాలను అపరిశుభ్రంగా తయారు చేయోద్దని అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: ఆరోగ్యసేతులో కొత్త ఫీచర్.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేషన్ వివరాలు.. డబుల్ టిక్స్‌తో