హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని ఆయన తెలిపారు. కొనేముందు ఒకట్రెండు సార్లు డాక్యుమెంట్లు పరీశిలన చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే HMDAను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం తాము ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణ దశలో ఉన్నవాటిని మాత్రం కూల్చివేస్తున్నామని.. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూడా కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించనుందని చెప్పొచ్చు.
ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. బోరబండ సున్నం చెరువు, మల్లంపేట్ కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలను నేలమట్టం చేశారు. మరోవైపు అక్రమాల కూల్చివేతలు జరుగుతుండగా… పలుచోట్ల ఆందోళనలు మిన్నంటాయి. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఆవేదన చెందుతున్నారు.
ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..