Hyderabad: అంత కష్టం ఏమొచ్చింది అమ్మా..! పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి

|

Jun 28, 2024 | 9:07 PM

ఏం కష్టం వచ్చిందో తెలియదు.. పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకుంది తల్లి.. తల్లి మృతి చెందగా...ఇద్దరు పిల్లల్లో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ సాయంతో అన్ని ఆధారాలు సేకరించారు.

Hyderabad: అంత కష్టం ఏమొచ్చింది అమ్మా..! పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
Women Ends Life
Follow us on

శంషాబాద్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకుందో తల్లి. కర్నాటక బీదర్‌ నుంచి వచ్చిన కుటుంబం శంషాబాద్ అర్బీనగర్‌లో అద్దెకు ఉంటోంది. భర్త కొరియర్‌ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ… ఉదయం భర్త వచ్చి చూ సేసరికి ఫ్యాన్‌కి ఉరివేసుకుని కనిపించింది.ఇద్దరు పిల్లలతో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని నిలోఫర్ హస్పటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవంటున్నారు కుటుంబ సభ్యులు .అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

…………………………………………………………………………

బాసరలో లడ్డూ, పులిహోర విక్రయాల్లో గోల్‌మాల్

బాసర సరస్వతి ఆలయంలో సిబ్బంది గోల్ మాల్ కు పాల్పడుతున్నారు. టికెట్లు లేకుండా లడ్డూ, పులిహోర ప్యాకెట్లు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రిజిస్ట్రార్లో తక్కువ ఎంట్రీ చేసి..ప్యాకెట్లు మాత్రం ఎక్కువ తీసుకొస్తున్నారు. ఈ విషయం గ్రామస్తులు ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈవో తనిఖీ చేసి ప్యాకెట్లను లెక్కించగా సిబ్బంది గోల్ మాల్ బయటపడింది.

ఒక్కొక్క బాక్సులో 100 లడ్డూలు కానీ పులిహోర ప్యాకెట్లు కానీ ఉండాలి. కానీ అంతకు మించి ఒక్కో బాక్సులో 50 నుంచి 60 ప్యాకెట్లను అదనంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. లడ్డూ, పులిహోర టికెట్లు ఇచ్చే కౌంటర్లలో తాత్కాలిక ఉద్యోగులు నియమించి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..