AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫరూక్, రేణుక ఇద్దరూ కలిసి లాడ్జికి వెళ్లారు.. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి..

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పరిధిలో ఓ హోటల్‌లో రేణుక అనే యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. యువతి ఆత్మహత్య చేసుకుందని ఫారుక్ చెప్పగా, ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Hyderabad: ఫరూక్, రేణుక ఇద్దరూ కలిసి లాడ్జికి వెళ్లారు.. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి..
Faruk - Renuka
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 8:38 AM

Share

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అల్వాల్‌కు చెందిన రేణుక అనే యువతి మృతిచెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అల్వాల్‌కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫరూక్‌తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ గురువారం రాత్రి లంగర్‌హౌస్ పరిధిలోని ఓ హోటల్‌లో గదిని బుక్ చేసుకుని బస చేసినట్లు సమాచారం. అనంతరం తాను కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక గదిలో ఉరివేసుకుని కనిపించిందని ఫరూక్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. వెంటనే హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అయితే రేణుక కుటుంబ సభ్యులు ఫారుక్ చెప్పిన కథనాన్ని నమ్మడం లేదని, తమ కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఫారుక్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హోటల్‌లోని సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతి ఆత్మహత్యా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులోకి వచ్చే శాస్త్రీయ ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Follow Us