GHMC Worker: ఆరు రోజులగా కొనసాగిన సహాయక చర్యలు.. ఎట్టకేలకు దొరికిన అంతయ్య మృతదేహం..

|

Aug 09, 2021 | 1:48 PM

హైదరాబాద్‌లో ఆరు రోజుల క్రితం గల్లంతైన అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గల్లంతైన ప్రదేశం నుంచి 200 మీటర్ల దూరంలోని 800mm డయా సివర్ ట్రంక్ పైపు లైన్...

GHMC Worker: ఆరు రోజులగా కొనసాగిన సహాయక చర్యలు.. ఎట్టకేలకు దొరికిన అంతయ్య మృతదేహం..
Anathai Drainage Worker
Follow us on

హైదరాబాద్‌లో ఆరు రోజుల క్రితం గల్లంతైన అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గల్లంతైన ప్రదేశం నుంచి 200 మీటర్ల దూరంలోని 800mm డయా సివర్ ట్రంక్ పైపు లైన్ లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. కోయంబత్తూరు టెక్నాలజీని వినియోగించి.. పైప్ లైన్ లోకి కెమెరాను పంపి.. అంతయ్యను గుర్తించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రోజులుగా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అన్ని విభాగాల నుంచి 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 130 మీటర్ల పొడవు పైప్‌లైన్‌ తవ్వకాలు జరపడమే కాకుండా.. అనేక రకాల చర్యలు తీసుకున్నారు.

అంతయ్య గల్లంతైన సాహెబ్‌నగర్‌ నుంచి కుంట్లూరు చెరువు వరకు 250 డ్రైనేజ్‌ హోల్స్‌ను చెక్‌ చేశారు. చివరకు కోయంబత్తూరు నుంచి సీవర్ ట్రాకర్‌ తెప్పించి ఆచూకీ కనిపెట్టారు.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..