హైదరాబాద్‌లో మరో విషాదం.. అఫ్జల్‌ సాగర్‌ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు! కొనసాగుతున్న గాలింపు!

హైదరాబాద్‌లో మరో విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలిలో గోడ కూలి కూలీలు మృతి చెందిన ఘటన జరిగిన గంటకూడా గడవక ముందే ఆసిఫ్‌ నగర్‌లోని అఫ్జల్‌ సాగర్‌ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాద్‌లో మరో విషాదం.. అఫ్జల్‌ సాగర్‌ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు! కొనసాగుతున్న గాలింపు!
Hyderabad Heavy Rains

Updated on: Sep 14, 2025 | 10:32 PM

గత సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌ నగర్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అప్జల్‌ సాగర్‌ కాలువాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే, పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన మామ, అల్లుడిగా గుర్తించారు.

ఇక గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది. నాలా సరివాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భారీగా కురిసిన వర్షంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గంట వ్యవధిలో నగరంలో సుమారు 12 సెం.మీ మేర వర్షపాతం నమోదు అయినట్టు అధికారులు స్పష్టం చేశారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, రాయదుర్గం, షేక్‌పేట, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌,అమీర్‌పేట, రామ్‌నగర్‌, ముషీరాబాద్‌, తార్నాక, ఎల్బీనగర్‌, కుషాయిగూడ, కాచిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై మొత్తతం భారీగా వర్షపు నీరు చేరుకున్నాయి. దీంతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, జీఎచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.