Hyderabad: మహా ముదుర్లు.. హైరేంజ్ షోరూంలే వారి టార్గెట్.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యారు..

|

Oct 06, 2022 | 5:15 PM

బంగ్లాదేశ్‌ సరిహద్దుకు 3 కి.మీ దూరంలో నివసించే ఈ ముఠా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకులు, మొబైల్‌ షాపులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరినట్లు వెల్లడించారు.

Hyderabad: మహా ముదుర్లు.. హైరేంజ్ షోరూంలే వారి టార్గెట్.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యారు..
Phones
Follow us on

వాళ్ల కళ్లన్నీ హై రేంజ్ షోరూంలపైనే ఉంటాయి. బ్యాంకులు, మొబైల్ షాపులు, జ్యూవెలరీ షాపుల వద్ద రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట చోరీ చేస్తారు.. ఆ తర్వాత వాటిని బంగ్లాదేశ్, నేపాల్‌లలో అమ్మేస్తుంటారు. అలాంటి ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షోరూంలో బ్రాండెడ్ ఫోన్లను కొట్టేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు తరలించారు. ఆ ముఠాకు చెందిన ఇద్దరు కీలక నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో గత నెల 21న చోరీ జరిగింది. మొత్తం రూ.70లక్షల విలువైన 432 మొబైల్‌ ఫోన్లను దుండగులు చోరీ చేసినట్లు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ స్టోర్‌ మేనేజర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో ఐఫోన్‌, ఒప్పో, వన్‌ప్లస్‌, వివో వంటి టాప్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు తెలిపారు.

చోరీకి సంబంధించి సీసీటీవీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. ఈ కేసుపై వివిధ కోణాల్లో విచారణ నిర్వహించారు. అనంతరం ఝార్ఖండ్‌కు చెందిన షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసును పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఈ సమయంలో మహారాష్ట్ర ఔరంగబాద్‌లో ఓ నేరస్తుడు ఫింగర్‌ ప్రింట్‌ లభించడంతో అసలు గుట్టు బయటపడింది. గతంలో అతనిపై ముంబై సహా పలు నగరాల్లో కూడా నేర చరిత్ర ఉన్నట్టు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌లా మొబైల్స్‌ దొంగతనం చేసిన వాటిని నేపాల్, బాంగ్లాదేశ్‌లో అమ్మేస్తున్నారని తేలినట్లు తెలిపారు.

బంగ్లాదేశ్‌ సరిహద్దుకు 3 కి.మీ దూరంలో నివసించే ఈ ముఠా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకులు, మొబైల్‌ షాపులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.80వేల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫోన్ల రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..