Hyderabad: పోలీసులు ట్రక్‌లో ఏమున్నాయ్ అని అడిగితే విస్తరాకుల లోడ్ అన్నారు.. చెక్ చేయగా మైండ్ బ్లాంక్

|

Jul 17, 2022 | 3:42 PM

పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా ఎర్ర చందనం ఎలా తరలించాడో అందరూ చూసే ఉంటారు. తాజాగా గంజాయి స్మగర్లు సైతం అదే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఎక్కడంటే..?

Hyderabad: పోలీసులు ట్రక్‌లో ఏమున్నాయ్ అని అడిగితే విస్తరాకుల లోడ్ అన్నారు.. చెక్ చేయగా మైండ్ బ్లాంక్
representative image
Follow us on

Telangana: రోడ్డుపై ఏ వాహనంలో చెక్ చేసినా అదే.. రైళ్లలో తనిఖీలు జరిపినా అదే.. ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో అదే..  స్టెపినీ టైర్లలో కూడా అదే. అదే.. అదే అంటున్నారు.. ఏంటో చెప్పరేంటి అనుకుంటున్నారా..? చెప్పడానికి ఇంకేముందండీ బాబు.. గుప్పున పీలిస్తే మత్తును నషాలానికి ఎక్కించే గంజాయి. యువత భవిష్యత్‌‌ను చిత్తు చేస్తున్న గంజాయి. స్మగ్లర్స్ వాడుతున్న తెలివితేటలు చూసి.. ఏం ఇస్మార్ట్ ఐడియాలురా బాబు అనాల్సిందే.  ముల్లును.. ముల్లుతోనే తీయాలన్నట్లు.. పోలీసులు కూడా అంతే స్మార్ట్‌గా తనిఖీలు చేపడుతూ అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. లారీల్లో, బస్సుల్లో, కారుల్లో, రైళ్లలో, ఓడల్లో గంజాయి రవణా చేస్తూ ఇప్పటికే ఎందరో పట్టుబడ్డారు. తాజాగా విస్తారాకుల కట్టల మాటన ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు.  న్యూ మలక్‌పేట మార్కెట్(new malakpet market) వద్ద శనివారం తెల్లవారుజామున నిందితులు పోలీసులకు చిక్కారు.  స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ (వెస్ట్ జోన్), CCS, చాదర్‌ఘాట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి గంజాయి రవాణా గుట్టును రట్టు చేశారు. మెట్రో పిల్లర్ నంబర్ 1460 దగ్గర మహీంద్రా బొలెరో వాహనాన్ని ఆపి సోదాలు చేయగా.. విస్తరాకుల కట్టల కింద మూడు తెల్లటి పాలిథిన్ బ్యాగులు కనిపించాయి. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా చింతపల్లి అడవుల్లో ఎండు గంజాయి ఆకులను సేకరించి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 30 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  ఒక్కో ప్యాకెట్‌లో 2.20 కిలోల గంజాయి ఆకులు ఉన్నట్లు తెలిపారు.  నిందితులను ఏపీ(Andhra Pradesh)లోని అనకాపల్లికి చెందిన ఆకు వ్యాపారం చేసే మువ్వల నాగార్జున, నమ్మి తాతాజీగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..