Hyderabad: హైదరాబాదీలకు ముఖ్యగమనిక.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

|

Apr 13, 2023 | 4:38 PM

భారత రాజ్యంత నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. హైదరబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఈ భారీ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే దాదాపు...

Hyderabad: హైదరాబాదీలకు ముఖ్యగమనిక.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad Traffic
Follow us on

భారత రాజ్యంత నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. హైదరబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఈ భారీ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నెక్లెస్‌ తదితర మార్గాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ అనంతరం ఐమ్యాక్స్‌ థియేటర్‌ వెనకాల ఏర్పాలు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్న తరుణంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఏయే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయంటే..

* వీవీ విగ్రహాం-నెక్లెస్‌ రొటరీ-ఎన్టీఆర్‌ మార్గ్‌తో పాటు తెలుగు తల్లి జంక్షన్‌ల మధ్య వాహనాలను అనుమతించారు.

ఇవి కూడా చదవండి

* ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్‌ రొటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్‌ నిరంకారి వైపు మళ్లిస్తారు.

* ట్యాంక్‌బండ్‌ నంఉచి పీవీఎన్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను సొనబాయ్‌ మజీద్‌ నుంచి రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

* రసూల్‌పూర/మినిస్టర్‌ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్‌ రొటరీ వైపు వెళ్లే వారిని నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వద్ద దారి మళ్లిస్తారు.

* ట్యాంక్‌బండ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వెళ్లే వాహనాలను తెల్లి తల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఇక్బాల్‌ మీనర్‌ వైపు మళ్లిస్తారు.

* బూర్గుల రామ కృష్ణ రావు భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌కు వాహనాలను అనుమతించారు. వీరిని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

* ఖైరతాబాద్‌ గణేష్‌ మార్గం నుంచి ప్రింటింగ్ ప్రెస్‌ జంక్షన్‌ లేదా నెక్లెస్‌ రొటరీకి వాహనాలను అనుమంతించారు. వీరిని రాజ్‌దూత్‌ లేన్‌ వైపు మళ్లిస్తారు.

* ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌, లుంబినీ పార్క్‌ శుక్రవారం మూసేస్తారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..