Kumari Aunty: కుమారీ ఆంటీ క్రేజ్ అలాంటిది మరి.. హైదరాబాద్‌ పోలీసుల బేరం మాములుగా లేదుగా.. ట్వీట్‌ చూశారా?

|

Feb 20, 2024 | 3:52 PM

సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో కుమారీ ఆంటీ క్రేజ్‌ నెక్ట్స్ లెవెల్‌ కు వెళ్లిపోయింది. ఇప్పుడు టీవీ షోల్లోనూ సందడి చేస్తుందామె. పలు టీవీ ప్రోగ్రామ్స్, ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. ఇదిలా ఉంటే కుమారీ ఆంటీ క్రేజ్ కు కారణం ఆమె నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్‌. ' మీ బిల్లు మొత్తం రూ.1000, రెండు లివర్లు ఎక్స్ ట్రా' అనే డైలాగ్ సోషల్‌ మీడియాను షేక్ చేసింది.

Kumari Aunty: కుమారీ ఆంటీ క్రేజ్ అలాంటిది మరి.. హైదరాబాద్‌ పోలీసుల బేరం మాములుగా లేదుగా.. ట్వీట్‌ చూశారా?
Kumari Aunty
Follow us on

కుమారీ ఆంటీ.. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేరు. హైదరాబాద్ లోని కోహినూర్ ఐటీసీ వద్ద రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడిపే ఆమె గత నెల రోజులుగా సోషల్‌ మీడియా సెన్సేషన్ అయిపోయారు. ఒక్కసారిగా కస్టమర్లు పెరగడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం, పోలీసులు జోక్యం చేసుకుని ఫుడ్‌ స్టాల్‌ను క్లోజ్‌ చేయించడం, సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో కుమారీ ఆంటీ క్రేజ్‌ నెక్ట్స్ లెవెల్‌ కు వెళ్లిపోయింది. ఇప్పుడు టీవీ షోల్లోనూ సందడి చేస్తుందామె. పలు టీవీ ప్రోగ్రామ్స్, ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. ఇదిలా ఉంటే కుమారీ ఆంటీ క్రేజ్ కు కారణం ఆమె నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్‌. ‘ మీ బిల్లు మొత్తం రూ.1000, రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అనే డైలాగ్ సోషల్‌ మీడియాను షేక్ చేసింది. కుమారీ ఆంటీని క్రేజీ సెలబ్రిటీ మార్చేసింది. టీవీ షోస్‌లోనూ, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ లోనూ ఈ డైలాగ్‌ పై మీమ్స్‌ హోరెత్తుతున్నాయి. ఇదే డైలాగ్ పై డీజే సాంగ్స్ కూడా వచ్చింది. దీంతో ఇదే డైలాగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాడేసుకున్నారు. . ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్‌ పై వెళుతున్నాఉ. అయితే అతను హెల్మెట్ ధరించకపోగా.. నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరా కళ్లకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోకు ‘మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అనే క్యాప్షన్ జోడించారు.
మొత్తానికి జరిమానాకు సంబంధించని వివరాలు చెబుతూ ట్రాఫిక్ పోలీసులు కమారి ఆంటీ స్టైల్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి బైక్‌ కు సైడ్ మిర్రర్స్ లేవని, ఇండికేటర్లు కూడా కనిపించడం లేదంటూ వాటికి కూడా ఫైన్ వేయాలని నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…