Hyderabad Traffic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సమాచారం ఎంత త్వరగా మార్పిడి జరుగుతుందో అదే స్థాయిలో ఫేక్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అసలు ఊహకు అందని పుకార్లు సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూస్తుంటే.. నిజమైన వార్తలను కూడా నమ్మలేని పరిస్థితి వస్తోంది. మళ్లీ సంబంధిత వర్గాలకు చెందిన వారు అధికారికంగా స్పందిస్తే తప్ప అది ఫేక్ వార్త అనే విషయం తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు రోజుకోటి నెట్టింట సందడి చేస్తున్నాయి.
తాజాగా అలాంటి ఓ వార్తే నెట్టింట వైరల్‌గా మారింది. అదే వాహనాలపై విధించే చలాన్ల విషయమై. అక్టోబర్ 4 నుంచి 7 వరకు మూడు రోజులపాటు ట్రాఫిక్ లోక్ అదాలత్‌లో భాగంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం కల్పించారని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పేరుతో ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టిలో కూడా పడడంతో.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ అంటూ వస్తోన్న వార్తలపై ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని, ఎవరూ అలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్పుడు కూడా అవన్నీ ఫేక్ వార్తలేనని స్పష్టత నిచ్చారు.
#HYDTPinfo
We noticed a message is going viral on Social Media that there will be Traffic Lokadalath from 4th to 7th Oct. @HYDTP on 03rd Sep 2021, posted on SM that the msg is Fake.@HYDTP once again inform all the citizens that the msg is Fake. Don’t believe and don’t spread. pic.twitter.com/EJU9cBQojX— Hyderabad Traffic Police (@HYDTP) October 3, 2021
Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..