Hyderabad: హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి

|

Aug 12, 2021 | 3:17 PM

మట్టిని బంగారంతో పోల్చుతారు. ఎందుకంటే, అన్నదాతలు... ఈ మట్టిలోనే బంగారాన్ని పండిస్తారు. ఇక, మట్టికి ఎన్నో రోగాలను నయం చేసే అద్భుత గుణం ఉంది...

Hyderabad: హైదరాబాదీలు బీ అలెర్ట్... కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి
Hyderabad Soil
Follow us on

మట్టిని బంగారంతో పోల్చుతారు. ఎందుకంటే, అన్నదాతలు… ఈ మట్టిలోనే బంగారాన్ని పండిస్తారు. ఇక, మట్టికి ఎన్నో రోగాలను నయం చేసే అద్భుత గుణం ఉంది. అందుకే, మన్నును ఒంటి పూసుకుని మట్టి స్నానం చేస్తారు. చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటే మంచిదంటారు పెద్దలు. మట్టిలో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, మట్టి వాసన శరీరానికి ఎంతో హాయినిస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాంటి మట్టి ఇప్పుడు కాలకూట విషంగా మారిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు గాలి, నీరే విష తుల్యంగా మారిపోయాయని అనుకుంటే, చివరికి మట్టి కూడా ఆ జాబితాలో చేరిపోయిందని హెచ్చరిస్తున్నారు.

మహానగరం హైదరాబాద్ లో పర్యావరణ సమతుల్యం దెబ్బతిందని నేషనల్ జియో ఫిజికల్ ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది. ఎంతలా అంటే, మట్టి పాయిజన్ గా మారిపోయి.. జీవరాశి బతకలేని స్థాయికి చేరింది. కనీసం మొక్క మొలకెత్తలేని స్థితికి చేరింది. ఇది నమ్మశక్యంలా లేకపోయినా..ఇదే నిజం. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో సాధారణ మొక్కలే కాదు… చివరికి పిచ్చి గడ్డి కూడా మొలవని స్థాయిలో మట్టి విషంగా మారిపోయింది.

చెరువులు కనుమరుగు కావడం… పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోవడంతోనే ఎన్విరాన్ మెంట్‌ ఇన్ బ్యాలన్స్ ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మట్టి పరిస్థితి ఇలాగుంటే, నీళ్లు ఎప్పుడో గరళంగా మారిపోయాయి. హైదరాబాద్ లో చెరువులన్నీ దాదాపు కాలకూట విషంతో నిండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్ వాతావరణం విషమయంగా మారిపోయిందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.

పర్యావరణ సమతుల్యానికి చెట్లే కీలకం. కానీ, కాంక్రీట్ జంగిల్ లా మారిన భాగ్యనగరంలో పచ్చదనం శాతమే తగ్గిపోతోందని, అందుకే ఎన్విరాన్ మెంట్‌ ఇన్ బ్యాలన్స్ ఏర్పడుతోందని గ్రీన్ రివల్యూషన్ ప్రతినిధులు అంటున్నారు. హైదరాబాద్ లో వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నారు. గాలి నీరే కాదు చివరికి మట్టి కూడా కాలకూట విషంగా మారుతోంది. కేవలం పదేళ్లలోనే ఇవన్నీ విషతుల్యంగా మారిపోయాయి. కనీసం ఇప్పుడైనా అలర్ట్ కాకపోతే హైదరాబాద్ లో మానవ మనుగడే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సో బీ కేర్ ఫుల్ హైదరాబాదీస్. బీ అలర్ట్‌.

Also Read: ‘పిల్ల జమిందార్’.. 427 గ్రామాలకు అతడి మాటే శాసనం.. ఇంట్రస్టింగ్ స్టోరీ

పైత్యం అంటే ఇదే.. బైక్‌కు ట్రాక్టర్ టైర్ బిగించాడు.. ఆ తర్వాత