
హైదరాబాద్‌లో అధికారులు డేగ కళ్లతో నిఘా పెట్టినా…డ్రగ్స్ బ్యాచ్‌లు రెచ్చిపోతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న ఏడుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్లలో రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్ ఉన్నారు. వీళ్లతోపాటు మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. వీళ్లతోపాటు బెంగళూరుకు చెందిన రాహుల్, పురుషోత్తం, చందన్ కూడా పట్టుబడ్డారు. నిందితుల్లో మణిదీప్…రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నాడు. తేజ, నీలిమా.. గతంలో క్లౌడ్ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చి డ్రగ్స్ దందాలోకి దిగారు. వీళ్లకు బెంగళూరులో ఉండే డ్రగ్స్ సప్లయర్ రాహుల్ పరిచయం అయ్యాడు. అతని నుంచి చందన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఆరుగురుని అరెస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్‌టసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల నిఘా పెరగడంతో…మత్తు ముఠాలు చిత్తవుతున్నాయి. ఈ కేటుగాళ్లు రూటు మార్చినా…పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్లకు చెక్ పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.