హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకూ శబరిగిరుల్లో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. ఈ మాలాను ధరించిన భక్తులు 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేలమీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏక భుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు.
ఈ నేపథ్యంలో దీక్ష చేపట్టిన స్వాములు ప్రతి రోజు పూజ నిర్వహిస్తుంటారు. కొందరు ఇళ్లలోనే పూజను కొనసాగిస్తారు. అయితే హైదరాబాద్‌లోని కాళడి శ్రీ ఆది శంకర మఠం ప్రాంగణములో 15 డిసెంబర్ 2024 ఆదివారం భక్తుల అందరి సహకారంతో సామూహికా అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వాములు తెలిపారు.
సామి దర్శనం చేసుకోలేనివారికి, గృహంలో అయ్యప్ప పూజ నిర్వహించలేని వారికి, లేదా అయ్యప్ప స్వామిని పూజించాలని ఆకాంక్షించే వారికి ఇది ఒక పావనమైన ఆవకాశమని తెలిపారు. మీ పేరు మీద అయ్యప్ప పూజ బుక్ చేసుకోవడానికి కేవలం రూ. 1,000 చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు.
నమోదు కోసం ఈ లింక్ ద్వారా చేసుకోండి:
https://kaladyshankaramadomts.org/index.php/worldline/bookings
స్వాములు తమ ఇష్టానుసారం పడిపూజను నిర్వహించుకోవచ్చు.
వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 8350903080
వెబ్‌సైట్: https://kaladyshankaramadomts.org
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి