GHMC: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రెండో రోజూ హైడ్రామా.. 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్లపై కేసులు నమోదు

|

Nov 24, 2021 | 5:05 PM

GHMC ప్రధాన కార్యాలయం కేంద్రంగా పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తించారు. నిన్న మేయర్‌ చాంబర్‌ను చుట్టిముట్టి రచ్చచేశారు BJP కార్పొరేటర్లు. అదే ప్రాంతాన్ని ఇవాళ పాలతో శుద్ధితో చేసి కౌంటర్ ఇచ్చారు TRS కార్పొరేటర్లు.

GHMC: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రెండో రోజూ హైడ్రామా.. 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్లపై కేసులు నమోదు
Ghmc
Follow us on

GHMC Corporators attack: హైదరాబాద్‌లో TRS వర్సెస్‌ BJP రచ్చ పీక్ స్టేజ్‌కి చేరింది. GHMC ప్రధాన కార్యాలయం కేంద్రంగా పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తించారు. నిన్న మేయర్‌ చాంబర్‌ను చుట్టిముట్టి రచ్చచేశారు BJP కార్పొరేటర్లు. అదే ప్రాంతాన్ని ఇవాళ పాలతో శుద్ధితో చేసి కౌంటర్ ఇచ్చారు TRS కార్పొరేటర్లు.

GHMC ఆఫీసులో వరుగా రెండో రోజూ కూడా హైడ్రామా నడిచింది. నిన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్‌ ఛాంబర్‌పై దాడి చేశారు. వందలాది కార్యకర్తలతో బల్దియా ఆఫీస్‌ను చుట్టుముట్టారు. కౌంటర్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు TRS కార్పొరేటర్లు. BJP ఆందోళన చేసిన చోట పాలాభిషేకం చేశారు . డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు బీజేపీకి కౌంటర్‌ నిరసనలో పాల్గొన్నారు. GHMC ఆఫీసులో నిన్న జరిగిన ఘటనను ఖండించారు మంత్రి కేటీఆర్. గాడ్సే భక్తుల నుంచి గాంధీ మార్గం ఆశించడం..టూ మచ్ అంటూ సెటైర్‌తో కూడిన ట్వీట్ చేశారు.

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్ల‌పై సైఫాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేర‌కు.. దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీల‌న అనంత‌రం కార్పొరేట‌ర్ల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిన్న 10 మంది కార్పొరేట‌ర్ల‌పై కేసులు న‌మోదు చేయ‌గా, ఇవాళ మ‌రో 22 మందిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రికొంత మంది బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది.

జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై చ‌ట్టం ప్రకారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్యవ‌హ‌రించార‌ని కేటీఆర్ ధ్వజ‌మెత్తారు.


అటు MLC ఎన్నిక కోడ్‌వల్లే జనరల్‌బాడీ మీటింగ్ పెట్టలేదని GHMC మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. కార్పొరేటర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని వెల్లడించారు. నిరసనల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ..ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదన్నారు మేయర్‌. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. GHMC ఆఫీసు, మేయర్‌ కార్యాలయంలో BJP కార్పొరేటర్లు చేసిన రచ్చపై కేసు నమోదైంది. BJP కార్పొరేటర్లు, కార్యకర్తలపై పోలీసులకు కంప్లైంట్ చేశారు బల్దియా ఉద్యోగులు. మొత్తం 32 మంది కార్పొరేటర్లను గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేశారు.

Read Also…  AP CM YS Jagan: దెబ్బతిన్న ఇళ్లకు కొత్త ఇళ్లు.. వరద సహాయంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు!