హైదరాబాద్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్.. వారంతా ఇక్కడ ఇళ్ల కొనుగోలుపైనే దృష్టి..

హైదరాబాద్ మినీ ఇండియా. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో దేశంలోని అన్ని ప్రాంతాలవారు నివాసం ఉంటున్నారు. చక్కటి వాతావరణం.. మంచి మౌలిక వసతులతో దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది హైదరాబాద్. వరల్డ్ లెవల్ టాప్ కంపెనీలు సైతం తమ బ్రాంచీలను హైదరాబాద్‌లో ఓపెన్ చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్.. వారంతా ఇక్కడ ఇళ్ల కొనుగోలుపైనే దృష్టి..
Real Estate

Edited By:

Updated on: Jan 10, 2024 | 2:13 PM

హైదరాబాద్ మినీ ఇండియా. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో దేశంలోని అన్ని ప్రాంతాలవారు నివాసం ఉంటున్నారు. చక్కటి వాతావరణం.. మంచి మౌలిక వసతులతో దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది హైదరాబాద్. వరల్డ్ లెవల్ టాప్ కంపెనీలు సైతం తమ బ్రాంచీలను హైదరాబాద్‌లో ఓపెన్ చేస్తున్నాయి. అలాంటి సిటిలో స్థిర నివాసంపై నార్త్ ఇండియన్స్ మక్కువ చూపుతున్నారు. వాణిజ్య వ్యాపారవేత్తలు మొదలు.. ఉన్నతాధికారుల వరకు కొనసాగుతున్న ఈ ట్రెండ్‌తో హైదరాబాద్ మంచి భూమ్‌తో ముందుకు వెళ్తున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అన్ని సంస్కృతులకు కేరాఫ్‌గా నిలుస్తున్న హైదరాబాద్ నగరం మినీ ఇండియా చెప్పబడుతుంది. దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం కూడా హైడరాబాదే. ఇక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధితో పాటు సిటీకి మంచి వాతావరణం ఉండటం కూడా హైదరాబాద్‌ను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యోగ రీత్యా లేదా వ్యాపారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలామంది సిటీకి వస్తుంటారు. ఇక్కడి పరిస్థితులు చూశాక హైదరబాద్ సిటిలో ఒక స్థిర నివాసం ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి మెదులుతుందనడంలో సందేహం లేదు. తెలుగువారికి చాలాకాలం రాజధానిగా ఉన్న హైదరాబాద్ సిటిలో ఒక ఇల్లు ఉండాలనే కోరిక తప్పనిసరిగా ఉంటుంది. అవకాశం ఉన్న చాలామంది సిటిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.. ఆస్తులు కొనుగోలు చెయ్యడం లాంటివి చేశారు. కానీ కొంతకాలంగా నగరంలో తెలుగువారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల పబ్లిక్ కూడా స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో ఎక్కువ అనుబంధం ఉన్న నార్త్ ఇండియన్స్ సిటిలో ఇళ్లు, భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. సౌతిండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటిగా హైదరాబాద్ ఉండటం.. మంచి ఉపాధి సౌకర్యాలు ఉండటం హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణం అవుతోంది.

ఇక హైదరాబాద్‌కు మరో మాంచి అవకాశం వాతావరణం. ఇక్కడి చక్కటి వాతావరణం.. అన్ని వయస్కుల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. నగరంలో మంచిమౌలిక సదుపాయాలు ఉండటం.. అన్ని రకాల ఫుడ్స్ అవెలబిలిటిలో ఉండటం.. దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు-రైల్ నెట్‌వర్క్ ఉండటంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్‌కు మంచి అస్సెట్. ఇలాంటి చాలా సౌకర్యాలు హైదరాబాద్‌కు పలువురిని ఆకర్షిస్తున్నాయి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ లింగ్డో హైదరాబాద్ సిటిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ప్రదాన కార్యాదర్శలు ఎస్కే జోషి, సోమేష్ కుమార్‌లు కూడా సిటిలో సొంత ఇళ్లను నిర్మాణం చేసుకున్నారు. అలా సిటితో చాలాకాలం అనుబంధం ఉన్న ఉన్నతాధికారులు వాణిజ్య వ్యాపార వర్గాలకు చెందినవారు సైతం సిటిలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో నార్త్ ఇండియన్స్ సొంత ఆస్తులు, ఇళ్లు కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుండటంతో సిటీ రియల్ ఎస్టేట్‌కు కొంత ఊతం ఇచ్చే అంశంగా రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.