
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.. కాగా.. బుధవారం, గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2రోజులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు ఉండనున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ గా ఉండాలని.. సెలవులు రద్దు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా.. హైదరాబాద్ నగరం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.. వర్షం కారణంగా పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున GHMC అన్ని విధాలా సిద్ధమైంది. మూడు రోజులపాటు GHMC వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. జలమండలి, వాటర్ బోర్డు , హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ తో పాటు పలు శాఖల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్. 269 వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..