Hyderabad: ‘మబ్బే మసకేసింది’.. హైదరాబాద్‌ను వీడనంటోన్న వర్షం. దంచుడే దంచుడు..

|

Jul 20, 2023 | 4:10 PM

హైదరాబాద్‌ను వరుణుడు వీడనంటున్నాడు. గ్యాప్‌ లేకుండా కుమ్మేస్తున్నాడు. రాత్రి, పగలు నో బ్రేక్‌.. నిరంతర వాన ధాటి..ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లు..నదులను తలపిస్తున్న ప్రవాహాలు..రోడ్లన్నీ జలమయం..ఎటు చూసినా వాన..వాన..వాన.. పనులకు వెళ్లేవాళ్లు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు..ఆఫీసు టైమింగ్స్‌లో అయితే రోడ్లన్నీ వెహికల్స్‌తో నిండిపోయాయి....

Hyderabad: మబ్బే మసకేసింది.. హైదరాబాద్‌ను వీడనంటోన్న వర్షం. దంచుడే దంచుడు..
Rain Alert
Follow us on

హైదరాబాద్‌ను వరుణుడు వీడనంటున్నాడు. గ్యాప్‌ లేకుండా కుమ్మేస్తున్నాడు. రాత్రి, పగలు నో బ్రేక్‌.. నిరంతర వాన ధాటి..ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లు..నదులను తలపిస్తున్న ప్రవాహాలు..రోడ్లన్నీ జలమయం..ఎటు చూసినా వాన..వాన..వాన.. పనులకు వెళ్లేవాళ్లు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు..ఆఫీసు టైమింగ్స్‌లో అయితే రోడ్లన్నీ వెహికల్స్‌తో నిండిపోయాయి. నింగి నుంచి ఆగని వాన..నేలపై కదలని వాహనాలు..మధ్యలో తడుస్తున్న జంట నగరవాసులు..గంటల తరబడి రోడ్లపై తడిసి ముద్దయ్యారు..

మూడు రోజుల నుంచి ముసురు పట్టిన హైదరాబాద్‌లో ఐటి సెక్టార్‌లో అయితే. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. లింగంపల్లి దగ్గర రైల్వే అండర్‌ పాస్‌ వరద నీటితో మునిగిపోయింది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బుల్డోజర్‌పై నిలబడి. వరద ప్రాంతంలో పర్యటించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బోరబండ, కూకట్ పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర్ ల్లోని పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. నగరవాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీమ్ లను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో రేపు (శుక్రవారం) కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పురాతన భవనాల కింద ఉండొద్దని అధికారులు సూచించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..