
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, ఎంత పకడ్బందీగా తనిఖీలు చేపడుతోన్న అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ స్మగ్లింగ్‌లో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా గంజాయిని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఓ భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. హరియాణా హిసార్ జిల్లాకు చెందిన జీవన్‌సింగ్ అనే ట్రక్కు డ్రైవర్.. జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్, హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్‌తో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు.
ఇదే క్రమంలో తాజాగా షోలాపూర్‌కు భారీగా గంజాయిను స్మగ్లింగ్ చేశాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోలూ అంకిత్‌సింగ్‌తో కలిసి డీసీఎంలో 758 కిలోల గంజాయిను తరలించాలరు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండడానికి పైన తౌడుబస్తాలు వేశారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టిన షాపూర్ నగర్ పోలీసులు అనుమానం వచ్చి కాస్త లోతుగా వెతికారు. దీంతో లోపల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.35 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. జీవన్‌సింగ్, అంకిత్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..