Hyderabad: స్విగ్గీ డెలివరీ బాయ్ బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు.. లోపల కనిపించింది చూసి మైండ్ బ్లాంక్
మత్తు సప్లై చేసే పెడ్లర్స్ రోజుకో కొత్త దారి అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పుష్ప స్టైల్‌ను ఫాలో అయి.. చాలా మంది దొరకిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి పోలీసులకు దొరికిపోతున్నామన్న ఉద్ధేశంతో ఈ సారి మరింత విభిన్నంగా ఆలోచించారు.
అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. పోలీసులకు కనిపిస్తూనే ఉంది. ఇంకేంటి.. గంజాయి. యస్.. కాప్స్ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. మత్తు రవాణాకు బ్రేక్ పడటం లేదు. పెడ్లర్స్.. కొత్త మార్గాలు అన్వేశిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట(Jagathgiri Gutta) పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవ్పురం చౌరస్తాలో ఇద్దరు యువకులు గంజాయిని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఇందుకోసం వారు ఎన్నుకున్న మార్గం చూసి అధికారులు స్టన్ అయ్యారు. ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి బ్యాగ్‌లో గంజాయిని సరఫరా చేసేందుకు వారు ప్రయత్నించారు. ఇలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమనం రాదని ఈ రూట్ ఎంచుకున్నారు. అయితే తాజాగా పోలీసులకు చిక్కారు. విచారణలో నిజాలు తెలిసి కంగుతిన్నారు. ఎవ్వరికీ దొరకకుండా ఈ పద్ధతిలోనే సుమారు ఏడాదిగా గంజాయిని సరఫరా చేశామని నిందితులు చెప్పడంతో.. పోలీసులు అవాక్కయ్యారు.
స్విగ్గీ బ్యాగును తగిలించుకుని డెలివరీ బాయ్స్‌లా వెళ్తున్న యువకులపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయటంతో.. అసలు బాగోతం వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నానికి చెందిన వెంకట రమణ, వైజాగ్‌కు చెందిన సాయి హరి నారాయణ అనే ఇద్దరు యువకులు.. ఏడాది పాటు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా వర్క్ చేశారు. ఏడాది క్రితం ఆ పని మానేసి.. గంజాయి సప్లై షురూ చేశారు. వైజాగ్‌లోని ఏమిలి రమణ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తీసుకొస్తారు. కావాల్సిన వారికి గ్రాముల లెక్కన ఎవ్వరికీ అనుమానం రాకుండా.. స్విగ్గి బ్యాగులో తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు. ఎప్పటిలాగే గంజాయి డెలివరీకి వెళ్తున్న ఆ యువకులను చూసిన పోలీసులు.. డౌట్ వచ్చి తనిఖీ చేయగా ఈ క్రైమ్ వెలుగుచూసింది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఉప్పల్‌లో వాళ్లు నివాసముంటున్న రూమ్‌లో తనిఖీలు చేశారు. మొత్తం 6 కిలోల గంజాయితో పాటు.. రెండు హుక్కాపాట్లు, హుక్కా కాయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read: Telangana: వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు.. నగదు బ్యాగ్ లాక్కున్నారు.. కట్ చేస్తే..