Viral Video: ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం బైక్‌ దొంగిలిద్దామని వెళ్లి..

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనే సమెతను మీరు వినే ఉంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బైక్‌ దొంగతనానికని వెళ్లిన ఒక దొంగకు ఊహించని పరిణామం ఎదురైంది. బైక్‌ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తం కావడంతో అడ్డంగా బుక్కయాడు.

Viral Video: ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం బైక్‌ దొంగిలిద్దామని వెళ్లి..
Hyderabad Bike Theft

Edited By:

Updated on: Dec 27, 2025 | 12:07 PM

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనే సమెతను మీరు వినే ఉంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బైక్ ఎలా దొంగతనం చేయాలో తెలియక ఓ దొంగ అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి బైక్ దొంగతనం ప్రయత్నం కలకలం రేపింది. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగ యజమానికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతన్ని పట్టుకున్న యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. సుమారు రాత్రి 12 గంటల సమయంలో పటేల్‌నగర్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ వాహనాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. బైక్ స్టార్ట్ చేసే శబ్దం విన్న యజమాని వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చాడు. తన బైక్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరని నిలదీశాడు. అది విన్న స్థానికులు సైతం వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను బీబీనగర్‌కు చెందిన గణేష్‌గా గుర్తించారు. ఆయన అక్కడ పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. అతన్ని పూర్తిగా విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. తనతో పాటు మరో నలుగురు స్నేహితులు కలిసి ఈ దొంగతన ప్రయత్నానికి ప్రణాళిక వేశామని తెలిపాడు. దీంతో పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఘట్కేసర్ – ఉప్పల్ – నాగోల్ ప్రాంతాల్లో గత కొన్ని నెలల్లో బైక్ దొంగతనాలు పెరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సెప్టెంబర్‌లో ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో వరుసగా మూడు వాహనాలు ఎత్తుకెళ్లగా, నవంబర్‌లో చెర్రపల్లి రోడ్డుపై తిరుగుతున్న బైక్ దొంగల రాకెట్లు పోలీసులకు చిక్కిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. స్థానికులు పోలీసులు గస్తీ మరింత బలపరచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.