మత్తు యవ్వారం మహా మాయ చేస్తుంది. మందుకి అలవాటు పడ్డవాళ్లు సాయంత్రం అవ్వగానే.. వైన్ షాపుల వైపు చూస్తుంటారు. డైలీ అదే పనిలో ఉండే బ్యాచ్ కూడా ఉంటుంది. మందు పక్కనబెడితే ఈ మధ్య గంజాయి పెను ముప్పుగా మారింది. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికేస్తుంది. రేటు తక్కువ.. ఇచ్చే కిక్కు ఎక్కువ. దీంతో చాలామంది యూత్.. గంజాయివైపు అడిక్ట్ అయ్యారు. సీరియస్‌గా తీసుకున్న సర్కార్ గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. కొంచెం అనుమానం ఉన్నా మెరపు దాడులు చేస్తున్నారు. దీంతో ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ యువకుడు వనస్థలిపురం పరిధిలోని గాంధీనగర్‌లో గల ఇంట్లోనే పెరట్లో గంజాయి మొక్కల పెంపకం షురూ చేశాడు.
దీనిపై పోలీసులకు ఉప్పు అందింది. ఎల్బీ నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, వనస్థలిపురం పోలీసులు అకస్మాత్తుగా అతడి ఇంటికి సోదాలు చేశారు. వచ్చిన సమాచారం నిజమైంది. పూల మొక్కల మధ్యలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను అధికారులు గుర్తించారు. 10 మొక్కలను పెకలించి.. స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 300 గ్రాముల గంజాయి విత్తనాలు కూడా సీజ్ చేశారు. నిందితుడు రేవంత్ వర్మను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువకుడు గంజాయికి బానిసయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..