Hyderabad: పార్కుకు వచ్చే ప్రేమ జంటలే ఈ పోలీస్ టార్గెట్.. ఏకంగా బ్రోకర్‌ను పెట్టుకుని

హైదరాబాద్‌లో ఓ హోంగార్డు వసూళ్ల పర్వానికి తెరలేపాడు. కేబీఆర్ పార్కు, జీహెచ్ఎంసీ వాక్‌ వేలో ప్రేమ జంటలు, స్నేహితులైన యువతీ యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరిస్తున్నాడు. ప్రేమ జంటల సమాచారాన్ని చేరవేసేందుకు ఓ బ్రోకర్ని కూడా పెట్టుకున్నాడు.

Hyderabad: పార్కుకు వచ్చే ప్రేమ జంటలే ఈ పోలీస్ టార్గెట్.. ఏకంగా బ్రోకర్‌ను పెట్టుకుని
Muddam Srinivas
Follow us

|

Updated on: Aug 07, 2024 | 5:17 PM

అటు ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయంలో కావొచ్చు.. ఇటు క్రైమ్స్‌కు అడ్డుకట్ట వేయడంలో కావొచ్చు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉంది. అయితే కొంతమంది కింది స్థాయి సిబ్బంది.. అనుచితంగా ప్రవర్తిస్తూ డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. లంచాలు తీసుకోవడం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, నేరస్థులకు కొమ్ముకాయడం వంటి పనులతో.. పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. అలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా.. హైదరాబాద్‌లో పార్కుకు వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా ఓ హోంగార్డు.. వసూళ్లకు తెరలేపాడు. కేబీఆర్ పార్కు, GHMC వాక్‌ వేకు వచ్చే ప్రేమ జంటలు, యువతీ యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు.. అతడిపై అరోపణలను నిర్ధారించుకుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేబీఆర్ పార్కు పరిసరాల్లో, జీహెచ్ఎంసీ వాక్‌ వేలో వాకర్లు, పౌరుల సేఫ్టీ కోసం పోలీసు శాఖ ఆర్మ్డ్ బలగాలతో ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వాహనాలను తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా హెడ్ క్వా ర్టర్స్ నుంచి వచ్చే ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వాహనాన్ని… హోంగార్డు ముద్దం శ్రీనివాస్ నడిపేవాడు. పార్క్ చుట్టూ పెట్రోలింగ్ చేసే క్రమంలో… వాక్ వేలో వచ్చే లవర్స్, యువతీ యువకులను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ ప్రాంతంలోకి ప్రేమ జంటలు వస్తే సమాచారం కోసం.. ఓ బ్రోకర్‌ని కూడా పెట్టుకున్నాడు. ఇటీవల రోడ్డు నెంబర్-45లోని వాక్ వేలో ఓ జంట కూర్చోగా అక్కడకు వెళ్లిన శ్రీనివాస్.. బెదిరింపులకు దిగాడు.  అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారని.. స్టేషన్‌కు రావాలంటూ.. బెదిరించాడు. విడిచిపెట్టాలంటే రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో.. ఏటీఎంలో డ్రా చేసి ఇవ్వాలని యువకుడిని బలవంత పెట్టడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హోంగార్డు శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన బ్రోకర్ యాదగిరిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే చాలామందిని బెదిరించి.. డబ్బులు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిపై  సెక్షన్ 393 కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..