Hyderabad: సికింద్రాబాద్ లోని బాశెరా క్లబ్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. టాస్క్ ఫోర్స్, రాంగోపాల్‌పేట పోలీస్ లకు అసభ్యకర నృత్యాల తో క్లబ్ నడుస్తుంది అన్న సమాచారం తో ఏక కాలంలో ఇరువురు అధికారులు దాడులు నిర్వహించారు. క్లబ్ లో అస్లీల నృత్యాలు చేస్తున్న మందు బాబుల తో పాటు పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారందరిని గోపాల పురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పబ్ లో సమయం దాటిన తరువాత కూడా యువతి యువకుల అర్ధనగ్న డ్యాన్స్ లు డీజే స్టెప్పులు వేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది డ్యాన్సర్లు సహా 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
పబ్ నిర్వహణకు ఉన్న అనుమతులను అధికారులు పరిశీలిస్తున్నారు. రాం గోపాల్ పెట్ లో టెకీల క్లబ్ వ్యవహారం లో సిఐ పై వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు పబ్ నిర్వహణ అనుమతులపై సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పరిధిలోని క్లబ్ ల అనుమతులను పరిశీలించడం తో పాటు అశ్లీల నృత్యాలు జరుగుతున్న పబ్ లపై కొరడా జులిపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..