Hyderabad: 35 సంవత్సరాల తరువాత ఒకేసారి రెండు పండుగలు.. ప్రజలు సంబరాల్లో పోలీసులు పరేషానిలో..

| Edited By: Shiva Prajapati

Sep 16, 2023 | 7:53 AM

35 సంవత్సారాల తరువాత రెండు పండుగలు ఒకే సారి ఒకే రోజు రావటంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తయి రాత్రి పగలు తేడా లేకుండా గల్లి గల్లి లో శాంతి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు. నిన్న మొన్న వరకు ముస్లిం మత పెద్దలతో పాటు ముస్లిం యువకులను ప్రత్యేకంగా మీటింగ్ లో పెట్టి రెండు పండగలు ఒకేరోజు వస్తున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరిస్తారనే తీరుపై మాట్లాడిన అధికారులు ఇప్పుడు..

Hyderabad: 35 సంవత్సరాల తరువాత ఒకేసారి రెండు పండుగలు.. ప్రజలు సంబరాల్లో పోలీసులు పరేషానిలో..
Ganesh Chaturti
Follow us on

35 సంవత్సారాల తరువాత రెండు పండుగలు ఒకే సారి ఒకే రోజు రావటంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తయి రాత్రి పగలు తేడా లేకుండా గల్లి గల్లి లో శాంతి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు. నిన్న మొన్న వరకు ముస్లిం మత పెద్దలతో పాటు ముస్లిం యువకులను ప్రత్యేకంగా మీటింగ్ లో పెట్టి రెండు పండగలు ఒకేరోజు వస్తున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరిస్తారనే తీరుపై మాట్లాడిన అధికారులు ఇప్పుడు.. గణేష్ మండప నిర్వహకులను పిలిచి వారికి సూచనలు ఇవ్వటం జరుగుతుంది పాతబస్తీలోని అనేక పోలీస్ మీటింగ్స్ లో మండపాల అధ్యక్షులు కొందరు గణేష్ మండపం కు సంబందించి సమస్యలు అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లారు.

వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరిస్తామని దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య మండప నిర్వహకులకు హామీ ఇచ్చారు..35 సంవత్సరాల తర్వాత రెండు పండుగల వచ్చిన వేళ కలిసిమెలిసి నిర్వహించుకోవాలని పోలీసులు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా.. మతసామరస్యానికి పాటిస్తూ హైదరాబాద్ కి గంగా జమున్న తహసీబ్ ప్రపంచానికి చూపించాలని పోలీసులు ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నత స్థాయి అధికారుల నుంచి హోంగార్డ్ స్థాయి అధికారి వరకుమేము ఎల్లపుడూ 24 గంటలు అందరికీ అందుబాటులో వుంటాము అన్నారు.

పాతబస్తీ ఆలీ బాగ్ న్యూరోడ్ ప్రధాన రహదారిలో వినాయకుడి విగ్రహం తీసుకు వెళ్తుండగా.. ఓ చెట్టు విగ్రహం తాకడంతో అక్కడి ముస్లిం యువకులు వినాయకుడి సేవ కోసం ముందుకొచ్చి విగ్రహాన్ని లారీలు పెట్టి తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ముస్లిం యువకులను తన కార్యాలయంలో పిలిపించి సన్మానించారు ఆ యువకులు వినాయకుడి సేవ చేసుకుంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

మరిన్ని హైదరాబాద్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..