Hyderabad: ఇలా తయారయ్యారు ఏంట్రా.. కేకుల తయారీలో ఓల్డ్ మంక్ రమ్ము

| Edited By: Subhash Goud

Jan 04, 2025 | 5:31 PM

Hyderabad: హైదరాబాద్‌లో ఎటు చూసినా కల్తీమయం అవుతోంది. ఆహార పదార్థాల తయారీలో కల్తీ జరుగుతోంది. కుళ్లిపోయిన పదార్థాలు, ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నిర్వాహకులు. తాజాగా హైదరాబాద్‌లో బేకరీలు, రెస్టారెంట్లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కేకుల తయారీలో..

Hyderabad: ఇలా తయారయ్యారు ఏంట్రా.. కేకుల తయారీలో ఓల్డ్ మంక్ రమ్ము
Hyd Food
Follow us on

కనీస నీట్‌నెస్ లేదు.. వాడే సరుకుల్లో క్వాలిటీ లేదు. కుళ్లిపోయిన పదార్థాలు.. నిబంధనలు గాలికొదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటల్స్, రెస్టారెంట్స్ బెండు తీశారు అధికారులు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోన్న నిర్వాహకులు నోటీసులు జారీ చేసి.. ఆయా యూనిట్స్ సీజ్ చేశారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు బేకరీలపై ఫోకస్ పెట్టారు. వ్యాక్స్ బేకరీ, మాంగనీస్ బేకరీస్‌కు సంబంధించిన తయారీ యూనిట్లలో తనిఖీలు చేశారు. ప్లమ్ కేకుల తయారీలో ఆల్కహాల్, ఓల్డ్ మంక్ రమ్ము వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన ముడిసరుకులతో కేక్స్ తయారుచేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కేకుల తయారీ ప్రాంగణంలో బొద్దింకలు, ఎలుకలు తిరగడం గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాల దగ్గరే ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో బయటపడింది. FSSAI నిబంధనలకు విరుద్ధంగా బేకరీల నిర్వహణ ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. బిస్కెట్లు, కేకులు, ఇతర ఆహార పదార్థాల తయారీ ప్యాకింగ్‌లపై గడువు తేదీ లేబుల్స్ లేవు. ఎయిర్ కండిషన్ స్టోరేజీలలో ఆహార పదార్థాలు కలుషితమవుతున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన ముడి పదార్థాలనే బేకరీ తయారీ ఐటమ్స్‌కు వాడుతున్నారు. వ్యాక్స్ బేకరీ, మాంగనీస్ బేకరీస్‌కు నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి