Hyderabad: ఆపరేషన్ థియేటర్‌ విగతజీవిగా వైద్య విద్యార్థి.. అసలు నిమ్స్ హాస్పిటల్‌లో ఏం జరిగింది

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నిమ్స్ ఆసుపత్రిలో ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్పిటల్‌ సిబ్బంది సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కొణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ఆపరేషన్ థియేటర్‌ విగతజీవిగా వైద్య విద్యార్థి.. అసలు నిమ్స్ హాస్పిటల్‌లో ఏం జరిగింది
Hyderabad News

Updated on: Oct 17, 2025 | 2:26 PM

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నిమ్స్ ఆసుపత్రిలోని అనస్థీషియా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోజూ లాగే గురువారం రాత్రి కూడా విధులకు హాజరైన విద్యార్థి.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం విధులు హాజరయ్యేందుకు వచ్చిన తోటి విద్యార్థులు అక్కడ యువకుడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు వెంటనే హాస్పిటల్‌ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతుడు నితిన్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కొణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.