Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్‌.. చార్జీలు పెంపు..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్‌. టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు పెంచారు. మరి పెరిగిన ఛార్జీలు ఎలా ఉన్నాయి..? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుసుకుందాం ..

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్‌..  చార్జీలు పెంపు..
Hyderabad Metro Rail

Updated on: May 16, 2025 | 7:58 AM

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి సంస్థ నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి. నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది.

సీరియల్ నంబర్ కిలోమీటర్లు చార్జీ రూపాయలలో
1 2 కిమీ లోపల 12
2  2 – 4 కిమీ 18
3  4 – 6 కిమీ 30
4  6 – 9 కిమీ 40
5  9 – 12 కిమీ 50
6  12 – 15 కిమీ 55
7  15 – 18 కిమీ 60
8 18 – 21 కిమీ 66
9 21 – 24 కిమీ 70
10  24 కిమీ పైన 75

ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి నుండి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ.. గతంలోనే ఉచిత పార్కింగ్‌ సదుపాయాన్ని మెట్రో రైల్‌ అధికారులు ఎత్తేశారు. ఇప్పుడు చార్జీలు కూడా పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ ధరలు సామాన్యులకు భారంగా మారుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.