Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడిగింపు

| Edited By: Ravi Kiran

Apr 25, 2024 | 3:01 PM

ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో మెట్రో వేళల్లో మార్పులు చేసింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడయంలో మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు...

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడిగింపు
Hyderabad Metro
Follow us on

హైదరాబాదీలకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది మెట్రో. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు గమ్య స్థానాలకు చేరుస్తోంది. మరీ ముఖ్యంగా వేసవిలో బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందిగా ఫీలవుతున్న ప్రయాణికులు తక్కువ ఖర్చులో ఎంచక్కా ఏసీలో ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయాణికుల అవసరాలతో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెట్రో సమయాలను పొడగిస్తుంటారు మెట్రో అధికారులు.

ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో మెట్రో వేళల్లో మార్పులు చేసింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడయంలో మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. సాధారణంగా రాత్రి 10 గంటలకు చివరి మెట్రో ఉంటుంది. అయితే ఈరోజు సమయం పొడగించారు.

అర్థరాత్రి 12.15 గంటలకు చివరిగా రైళ్లు బయలుదేరనున్నాయి. 1.10 గంటలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఈ సమయంలో ఉప్పల్‌ స్టేడియం-ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతించనున్నారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు. మిగతా మార్గాల్లో మాత్రం ప్రతీ రోజూ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..