
2024 డిసెంబర్ 12.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి, కేంద్రమంత్రి కుర్చీలో ఉన్న కిషన్‌రెడ్డిని కలిసి, శాలువా కప్పి, సన్మానించి, విన్నపాలు వినిపించిన సందర్భం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం లక్షా 60 వేల కోట్లు కావాలని ఆయన పెట్టుకున్న రిక్వెస్ట్ కంటే వాళ్లిద్దరూ తీసుకున్న గ్రూప్ ఫోటోనే అప్పట్లో బాగా వైరలైంది. రాష్ట్ర ప్రయోజనాలా రాజకీయ ప్రయోజనాలా అని డౌట్లతో కామెంట్ బాక్సులు నిండిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణాలో బీ-టీమ్ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ కూడా తెరమీదికొచ్చేసింది. అది ప్రభుత్వాలు ఏర్పాటైన కొత్త రోజుల్లో ముచ్చటని, సత్సంబంధాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆడిన అలయ్‌బలయ్ అని లైట్ తీస్కుంది ఉమ్మడి అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్. ఏడాదిన్నర గడిచింది. మళ్లీ అటువంటిదే ఢిల్లీ నుంచి ఇంకో గ్రూప్ ఫోటో. కారు పార్టీకి మాంచి స్టఫ్ఫు దొరికినట్టయింది. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కొత్త టర్న్ తీసుకున్నట్టేనా? తెలంగాణలో సద్దుమణిగినట్టే సద్దుమణిగి, మళ్లీ సలసలా కాగుతోంది రాజకీయం. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం మంటలు పుట్టిస్తోంది. మొన్నటిదాకా ధాన్యం అమ్మకాలు, సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ చెలరేగి, నోర్లింత చేసుకున్న లీడర్లు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్‌లోకి దూరిపోయారు. రేవంత్‌రెడ్డి అండ్ కిషన్‌రెడ్డి.. మధ్యలో మెట్రో...