తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడు

|

Dec 27, 2023 | 2:05 PM

అవయవ దానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమంకి వేదిక అయింది హైదరాబాద్‌ ఎల్‌బినగర్ లోని కామినేని హాస్పిటల్. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేనకు చెందిన 24ఏళ్ల గంగుల హన్‌మంత్‌రెడ్డి అనే యువకుడు బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడు

తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడు
Organ Donation
Follow us on

అవయవ దానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమంకి వేదిక అయింది హైదరాబాద్‌ ఎల్‌బినగర్ లోని కామినేని హాస్పిటల్. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేనకు చెందిన 24ఏళ్ల గంగుల హన్‌మంత్‌రెడ్డి అనే యువకుడు బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడు. ఈనెల 22న బైక్‌ పై వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. దీంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మరింత సీరియస్ గా ఉండడంతో ఎల్‌బినగర్ కామినేని ఆస్పత్రికి తరించి మెరుగైన వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన హన్‌మంత్‌రెడ్డి కిడ్నీలు, లివర్, లంగ్స్‌ ను తల్లిదండ్రులు దానం చేశారు. మానవత్వం చాటుకున్నారు.