Hyderabad Liberation Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు. ఈ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భముగా చారిత్రక చార్మినార్‌ను త్రివర్ణ రంగుల లైట్లతో అలంకరించారు. ఈ లైటింగ్ జనాలను ఎంతగానో ఆకర్షిస్తోంది.
చార్మినారే కాకుండా వివిధ ప్రాంతాల్లో త్రివర్ణ రంగుల లైటింగ్స్ చూపరులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి