
బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయం ఇస్తుంది. విద్యా, ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి అద్దె ఇళ్లు, హాస్టల్స్‌లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరి ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్‌లోని జవహర్ నగర్‌లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమానికి. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహార్ నగర్‌లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకు ఉంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్‌రూమ్ బల్బ్ పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమనాకి ఓ ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి కొత్త బల్బ్‌ను పెట్టించాడు. అప్పుడు బల్బ్‌తో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీనితో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు.
అయితే ఈ నెల 13న బాత్రూమ్‌లో ఉన్న బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బ్ ఫిట్ చేయడానికి వచ్చిర ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు.
ఇంటి యజమాని అశోకే బాత్‌రూమ్‌లో ఎలక్ట్రీషియన్‌తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటు పరారీలో ఉన్నట్టు తెలుసుకొని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్, హోటల్స్‌లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మధురనగర్ లో రెంటేడ్ ఇంట్లో సీక్రేట్ కెమెరాల కలకలం..
అద్దె ఇంట్లోని బాత్రూమ్లో సీక్రేట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఇంటి యజమాని..#rentedhouse #cctv #cccamerainbathroom #tv9telugu pic.twitter.com/TGWLDUcS5M— TV9 Telugu (@TV9Telugu) October 17, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.