KPHB: క్షణకాలం.. చిన్న తప్పిదం.. పోయిన ప్రాణం..

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 14 ఏళ్ల బాలుడు, షటిల్‌ కాక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో దాన్ని రాకెట్‌తో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగలడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

KPHB: క్షణకాలం.. చిన్న తప్పిదం.. పోయిన ప్రాణం..
Accidental Death

Updated on: Aug 11, 2025 | 2:54 PM

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. ఇంటి ఆవరణలో స్నేహితుడితో కలిసి షటిల్ ఆడుతున్న 14 ఏళ్ల బాలుడు ఆకస్మికంగా విద్యుత్ షాక్‌తో ప్రాణాలు వదిలాడు. షటిల్ కాక్ ఇంటిని ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దాన్ని తీసుకునేందుకు చేతిలో ఉన్న బ్యాడ్మింటన్ రాకెట్‌తో ప్రయత్నించగా కరెంట్‌ షాక్‌ కొట్టింది. వెంటనే కుప్పకూలిపోయాడు

వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న అలసత్వం… క్షణిక తప్పిదం.. ఎంతో భవిష్యత్ ఉన్న టీనేజర్ ప్రాణం తీసింది. మీరెప్పుడూ ఇలాంటి సమయాల్లో నిర్లిప్తతతో వ్యవహరించకండి..

దిగువ వీడియోలో కలిచివేసే దృశ్యాలు ఉన్నాయి.. సున్నిత మనస్కులు చూడవద్దు… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..