Hyderabad: రాహేల్ కోసం గాలిస్తున్న పోలీసులు.. ఎమ్మెల్యే షకీల్‌పై పలు అనుమానాలు

|

Mar 21, 2022 | 10:11 AM

Hyderabad Crime News - MLA Shakeel SUV Accident Case: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు యాక్సిడెంట్‌ కేసులో అందరూ ఊహించిందే జరుగుతోందా? ఎమ్మెల్యే షకీల్‌ తనకు కొడుకు రాహేల్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారా?

Hyderabad: రాహేల్ కోసం గాలిస్తున్న పోలీసులు.. ఎమ్మెల్యే షకీల్‌పై పలు అనుమానాలు
MLA Shakeel Car Accindent
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు యాక్సిడెంట్‌ కేసులో అందరూ ఊహించిందే జరుగుతోందా? ఎమ్మెల్యే షకీల్‌ తనకు కొడుకు రాహేల్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసులో పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాబాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే కొడుకు రాహేల్‌ను పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం.. ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా రాహేల్‌ను ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదు. ఘటన జరిగిన రోజు నుంచి రాహేల్‌ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతడి ఆచూకీ కోసం నాలుగు పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు ఇప్పటి వరకు రాహేల్‌ను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును ఎమ్మెల్యే షకీల్ మ్యానేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దుబాయ్‌లో ఉన్న బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఇవాళ ఇండియాకు రానున్నారు. ఇప్పటికే ఆయనపై.. కేసును మేనేజ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే హైదరాబాద్‌ వచ్చాకైనా.. రాహేల్‌ ఆచూకీ దొరికేనా అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.

Also Read..

PM Modi: ప్రధాని మోడీ రోజూ ఎన్ని గంటలు నిద్రపోతారో తెలుసా.. వెల్లడించిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

Summer Tips: సమ్మర్‌లో స్కిన్‌ ట్యానింగ్‌కు గురవుతోందా? అయితే ఈ నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..