Hyderabad: హైదరాబాద్‌ వరద కష్టాలకు చెక్‌ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ

వానకాలం మొదలైంది. హైదరాబాద్‌ వరద కష్టాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది సర్కార్‌. సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది.

Hyderabad:  హైదరాబాద్‌ వరద కష్టాలకు చెక్‌ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ
Hyderabad Floods
Follow us

|

Updated on: Jun 09, 2024 | 9:51 PM

చినుకు పడితే చిత్తడే. వాన పడితే వణుకే. ఇదీ హైదరాబాద్‌ వాసుల దుస్థితి. వర్షాకాలం వచ్చిందంటే నగర వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆఫీస్‌ నుంచి ఇంటికెళ్లాలంటే నరకమే. ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వానకాలం వర్రీకి చెక్‌పెట్టేలా ప్రణాళికను రూపొందించింది.

ఈసారి వానకాలం కష్టాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది జీహెచ్‌ఎంసీ. ప్రత్యేకంగా 542 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది. అందులో మొబైల్ 157, స్టాటిక్ 242 బృందాలు, సీఆర్‌ఎంపీ రోడ్లపై 29, డిఆర్‌ఎఫ్ 30 బృందాలు, పోలీస్ శాఖ 13 బృందాలు, విద్యుత్ శాఖ 41, వాటర్ వర్క్స్ 22 బృందాలను ఏర్పాటు చేసింది. సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

నగర వ్యాప్యంగా 125 వరద బాధిత ప్రాంతాలున్నాయి. వాటిని దశలవారీగా తగ్గిస్తూ శాశ్వత పరిష్కారం చూపారు అధికారులు. నాలాల్లో ప్రజలు చెత్త, వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే పాయింట్ల దగ్గర పెద్ద సంపులను ఏర్పాటు చేసి వరద సమస్యకు చెక్‌ పెట్టారు. విపత్తు సమయాల్లో అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా నంబర్లు ఏర్పాటు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్