Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. NRIతో పాటు పట్టబడిన మరో ఇద్దరు!

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. అబిడ్స్‌లో పట్టుబడిన ఒక ముఠా నుంచి 33 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులు ఈ డ్రగ్స్‌ను బెంగళూరులో 9వేలకు ఒక్కో గ్రాము కొనుగోలు.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. NRIతో పాటు పట్టబడిన మరో ఇద్దరు!
Hyderabad Drugs

Updated on: Aug 24, 2025 | 10:36 PM

హైదరాబాద్లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. సిటీలో డ్రగ్స్ దందా పెరుగుతున్న కొద్దీ… దాన్ని కట్టడి చేసేందుకు ఖాకీల నిఘా అదేస్థాయిలో పెరుగుతోంది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా కొనసాగించినప్పటికీ ఏదో విధంగా ఖాకీలకు అడ్డంగా దొరికిపోతున్నారు. వెస్ట్రన్ కల్చర్ మోజులో పడిన యువత డ్రగ్స్‌కి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ బాగోతం బయటపడింది. అబిడ్స్‌లో 33 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బెంగళూరులో ఈ డ్రగ్స్‌ను ముగ్గురు యువకులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 9వేలకు ఒక్కో గ్రాము కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

నిందితులు మిస్బా ఉద్దీన్, అలీ అస్గర్‌, జుబేర్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అజీమ్‌ ఉద్దీన్‌ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్‌తో పట్టుబడ్డ యువకుల్లో జుబేర్ అలీ యూఎస్‌ సిటిజన్ షిప్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిందితులందరూ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కు ప్రాంతాలకు చెందిన సంపన్న కుంటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. వీరి సెల్ ఫోన్ లలోని డేటా ను పరిశీలిస్తున్నారు.

వీరికి డ్రగ్స్ ముఠాతో ఎవరెవరితో సంబంధం ఉంది అన్నదానిపై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వీరి దందా నగరంలో ఎక్కడ వరకు విస్తరించింది అన్నదానిపై కూపీ లాగుతున్నారు. వీరి దగ్గరి నుంచి డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడికి జరుగుతుంది…? పెడ్లర్‌గా ఎవరెవరు పని చేస్తున్నారు? డ్రగ్స్ వాడకం దారులు ఎవరు ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.