Hyderabad: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌బాడీ ఘటనలో పురోగతి.. మృతుడు ఇతడే

| Edited By: Anil kumar poka

Dec 08, 2021 | 1:47 PM

ముషీరాబాద్‌ రిసాలగడ్డ ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కేసుకు సంబంధించి ఓ బ్రేకింగ్ వచ్చింది. చనిపోయిన వ్యక్తి చిక్కడపల్లికి చెందిన కిషోర్‌గా గుర్తించారు.

Hyderabad: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌బాడీ ఘటనలో పురోగతి.. మృతుడు ఇతడే
Mushirabad Dead Body
Follow us on

ముషీరాబాద్‌ రిసాలగడ్డ ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కేసుకు సంబంధించి ఓ బ్రేకింగ్ వచ్చింది. చనిపోయిన వ్యక్తి చిక్కడపల్లికి చెందిన కిషోర్‌గా గుర్తించారు. కొన్నిరోజులుగా గంజాయి, మద్యానికి బానిస అయ్యాడని అంటున్నారు. చనిపోయే ముందు కుటుంబీకులతో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. కాబట్టి.. ప్రస్తుతం దీన్ని సూసైడ్‌గా భావిస్తున్నారు. కిషోర్‌ మిస్సయినట్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

డ్రింకింగ్ వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. నగరం నడిబొడ్డున… లక్షలాది మంది నిత్యం తాగే నీళ్ల ట్యాంక్‌లో డీకంపోజ్డ్ డెడ్‌ బాడీ ఉండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసలు, ఎన్ని రోజులుగా డెడ్ బాడీ ఆ ట్యాంక్‌లో ఉంది? నాలుగు రోజులా? నెల రోజులా? లేక అంతకంటే ఎక్కువా? అసలన్ని రోజులుగా శవం కుళ్లిన నీళ్లు సప్లై అవుతుంటే వాటర్ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోంది? ఆ నీళ్లు తాగుతోన్న ప్రజలు చచ్చిపోతే బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  వాటర్‌లో వెంట్రుకలు, చిన్నచిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయని చెప్పాకే వాటర్ వర్క్స్‌ సిబ్బంది కదిలారు. క్లీన్ చేయడానికి రావడంతో ఈ డెడ్ బాడీ బయటపడింది. అంటే, ఏ రేంజ్‌లో వాటర్ వర్క్స్ నిర్లక్ష్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ట్యాంక్‌ నిర్వహణను గాలికొదిలేసిన వాటర్ వర్క్స్ సిబ్బంది… ఏడాదిగా అటువైపే చూడలేదంటున్నారు స్థానికులు. డెడ్‌ బాడీ ఎప్పట్నుంచి వాటర్‌ ట్యాంక్‌లో డీకంపోజ్‌ అవుతుందో పక్కనబెడితే …వేలాది కుటుంబాలు ఈ నీళ్లనే తాగుతున్నాయి. 4 ఏరియాల్లోని 13 కాలనీలకు ఇక్కడ్నుంచి వాటర్ సప్లై జరుగుతోంది.

Also Read: గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’ షో