Hyderabad News: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి మాదాపూర్‌ ఎస్సైకి రెండేళ్ల జైలు శిక్ష

|

Sep 04, 2022 | 7:50 PM

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సైబరాబాద్‌ ఎస్సై్ కె రాజేందర్‌కు ఏసీబీ కోర్టు శనివారం (సెప్టెంబర్‌ 3) రెండేళ్ల జైలు శిక్ష విధించింది..

Hyderabad News: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి మాదాపూర్‌ ఎస్సైకి రెండేళ్ల జైలు శిక్ష
Madhapur Si
Follow us on

Madhapur SI Bribery case: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సైబరాబాద్‌ ఎస్సై్ కె రాజేందర్‌కు ఏసీబీ కోర్టు శనివారం (సెప్టెంబర్‌ 3) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో (జూన్ 3, 2013) రాయుడుగూడెం సీఎస్‌లో ఎస్సైగా ఉన్న సమయంలో మోటర్‌ సైకిల్‌ విడిపించుకునేందుకు ఇర్షాద్‌ ఖురేషీ అనే పౌరుడి దగ్గర రూ.10,000లు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై్ రాజేందర్‌పై ఏసీబీ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా తీర్పు వెలువరించింది. అవినీతి నిరోదక చట్టంలోని సెక్షన్‌ 7 కింద రూ.5 వేల జరిమానాతోపాటు రెండేళ్ల జైళు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కాగా కె రాజేంద్ర ప్రస్తుతం మాదాపూర్‌ స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.