‘మేము శారీరికంగా కలవలేదు.. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది’.. అప్సర కేసులో కొత్త ట్విస్ట్..

అప్సర హత్య కేసు రిమాండ్‌కు తరలించిన నిందితుడు సాయికృష్ణ శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు.

మేము శారీరికంగా కలవలేదు.. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది.. అప్సర కేసులో కొత్త ట్విస్ట్..
Apsara Case Incident

Updated on: Jun 10, 2023 | 1:24 PM

అప్సర హత్య కేసు రిమాండ్‌కు తరలించిన నిందితుడు సాయికృష్ణ శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ గట్టిగా కేకలు వేశాడు. జైలుకు వెళ్లినా బతకను. అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని కొన్ని రోజులుగా టార్చర్ చేసింది. ఒకవేళ చేసుకోకపోతే పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది.’ అని బోరున విలపిస్తూ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమెతో ఎప్పుడూ శారీరికంగా కలవలేదని పూజారి సాయికృష్ణ పోలీసులకు చెప్పాడట. అప్సరకు చెన్నైకి చెందిన యువకుడితో సంబంధం ఉందంటూ.. పోలీసులు అడిగే ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు చెప్పాడు సాయికృష్ణ.

కాగా, అప్సరను అత్యంత దారుణంగా చంపాడు పూజారి సాయికృష్ణ. కారు ముందు సీట్‌లో గాఢ నిద్రలో ఉన్న అప్సర మొహంపై కారు కవర్‌తో అదిమి పట్టుకుని.. ఊపిరి ఆడకుండా చేశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. అయినా కూడా.. తన వెంట తెచ్చుకున్న బెల్లం రాయితో అప్సర కణతి ఎడమ వైపు 15 సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎడమ కన్ను చిద్రమైంది. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కారు కవర్‌లో అప్సర డెడ్ బాడీని చుట్టాడు. అనంతరం సరూర్‌నగర్‌ తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌లో పడేసిన విషయం విదితమే.