Hyderabad: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పబ్స్ అండ్‌ బార్స్‌ యజమానులతో సీపీ ఆనంద్‌..

|

May 13, 2022 | 3:52 PM

Hyderabad: హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand) నగరంలోని పబ్స్‌, బార్స్ అండ్‌ డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్స్‌ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 100 మందికి పైగా బార్స్‌ అండ్ పబ్‌ల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Hyderabad: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పబ్స్ అండ్‌ బార్స్‌ యజమానులతో సీపీ ఆనంద్‌..
Follow us on

Hyderabad: గత నెలలో వెలుగులోకి వచ్చిన పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పబ్‌లో కొకైన్ లభించడం, పలువురు సెలబ్రిటీలు పట్టుబడడంతో డ్రగ్స్‌ దందాలో భాగ్యనగరం పేరు మరోసారి మార్మోగిపోయింది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యింది. డ్రగ్స్‌ దందా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand) నగరంలోని పబ్స్‌, బార్స్ అండ్‌ డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్స్‌ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 100 మందికి పైగా బార్స్‌ అండ్ పబ్‌ల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఈసందర్భంగా పబ్స్ అండ్‌ బార్స్‌ నిర్వహణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కీలక సూచనలు జారీ చేశారు సీపీ ఆనంద్‌. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై కూడా అవగాహన కల్పించారు.

12 గంటల కల్లా క్లోజ్ చేయాల్సిందే..

ఇవి కూడా చదవండి

‘దేశంలో పెట్టుబడులకు బాగా అనుకూలంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ముందుంది. ఇక్కడ శాంతి భద్రతలు, మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ను బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో చిన్న పాటి లాభాల కోసం కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి మచ్చతెస్తున్నారు. పబ్స్‌ అండ్‌ బార్లలోని సీసీ కెమెరాల బ్యాకప్‌ను సుమారు నెల రోజులు మెయింటయిన్ చేయాలని సీపీ సూచించారు. పబ్‌లలో రాత్రి11 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదు. 12 గంటల కల్లా పబ్స్ మూసివేయాలి. సౌండ్ సొల్యూషన్ విషయంలో కచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాలి. పబ్స్‌ అండ్‌ బార్లలో డ్రగ్స్ విక్రయిస్తే సహించేది లేదు. అలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీపీ హెచ్చరించారు.


మరిన్ని హైదరాబాద్ నగర వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Hyderabad: భర్తకు తెలియకుండా.. ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్

Lunar Eclips 2022: శత్రు, రోగ విముక్తి కోసం చంద్ర గ్రహణ సమయంలో ఈ మంత్రాలను పఠించండి..

ACSR GMC Nellore Jobs 2022: టెన్త్ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీలో ఉద్యోగాలు..