Hyderabad: పూర్తిగా నేలమట్టం చేయడమే మిగిలి ఉన్న ఆప్షన్.. పనులు స్టార్ట్

|

Jun 25, 2023 | 7:54 PM

వర్షం పడితే నీరంతా లోపలికి వచ్చేస్తుందని.. బిల్డింగ్ కాస్త పైకి లేపాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సయ్యింది. జాకీలు పట్టుతప్పడంతో ఇల్లు పక్కక ఒరిగింది. దీంతో ఇప్పుడు భవనం మొత్తం కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Hyderabad: పూర్తిగా నేలమట్టం చేయడమే మిగిలి ఉన్న ఆప్షన్.. పనులు స్టార్ట్
Hydraulic Jack System Failed
Follow us on

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. హైదరాబాద్ ఖుత్భుల్లాపూర్‌లో ఓ ఇంటి యజమాని చేసిన తలతిక్క పనికి.. ఓ భారీ బిల్డింగ్ నేలమట్టమవుతోంది. ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతే కాకుండా ఆ బిల్డింగ్‌ని ఆనుకుని ఉన్న రెండు అపార్ట్‌మెంట్లు డేంజర్‌లో పడ్డాయి. 25ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ ఇది. రోడ్డుకన్నా.. బేస్‌మెంట్ కొంచెం కిందకు ఉంది. వాన వస్తే నీళ్లు నిలబడుతున్నాయని.. దానిని లిఫ్ట్ చేయాలనే ఆలోచన చేశాడు. విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కి అప్పగించేశాడు.

ఆ ఆపార్ట్‌మెంట్‌లో ఓనర్‌తో పాటు ఐదు కుటుంబాలు ఉంటున్నాయి. అందులో ముగ్గురు ఖాళీ చేశారు. మిగిలిన రెండు కుటుంబాలు అందులో ఉండగానే.. కింద జాకీలు పెట్టి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే.. ఇదీ పరిస్థితి. వానాకాలం ఇంట్లోకి నీళ్లు వస్తాయనే భయం ఆ ఇంటి ఓనర్‌ది. ఈ లోపే బిల్డింగ్‌ను కొంచెం హైట్ లేపుకోవాలని ఆలోచనతో లిఫ్టింగ్ పనులు మొదలుపెట్టాడు. కానీ అది బెడిసికొట్టింది. ఇప్పుడు బిల్డింగ్ మొత్తం నేలమట్టం కాబోతోంది.

జాకీలు కొంచెం బెసికాయి. దీంతో బిల్డింగ్ 10 డిగ్రీల మేర పక్కకు ఒరిగింది. పక్క ఆపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. బిల్డింగ్‌ను పరిశీలించారు. ఎలాంటి పర్మీషన్లు తీసుకోకుండానే అక్కడ పనులు జరుగుతున్నాయని తెలుసుకుని అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను ఖాళీ చేయించి.. ఆ బిల్డింగ్‌ను పూర్తిగా పడగొట్టే ప్రయత్నాలు మొదలెట్టేశారు.

ఆ బిల్డింగ్‌ను ఇప్పుడు పైకి లేపడం అసాధ్యం. అలాగే వదిలేయడం అంటే అది డేంజరస్.. అందుకే పూర్తిగా కూల్చేయడానికే నిర్ణయం తీసుకుంది జీహెచ్‌ఎంసీ. దీంతో ఆ బిల్డింగ్‌లో ఉంటున్న కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..