Hyderabad: పబ్‌లో అమ్మాయి పరిచయం.. తనతో మాట్లాడడం లేదని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆపై..

ఆ యువతి, యువకుడి మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. ఆమె మరో యువకుడితో చనువుగా ఉండటం అతడికి నచ్చలేదు. అంతే.. అతనిలో ఉన్మాది బయటకు వచ్చాడు. అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో చోటుచేసుకుంది.. దీంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Hyderabad: పబ్‌లో అమ్మాయి పరిచయం.. తనతో మాట్లాడడం లేదని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆపై..
Crime News

Updated on: Jan 12, 2026 | 9:46 AM

హైదరాబాద్ బోరబండలో యువతి దారుణహత్యకు గురైంది.. తనతో మాట్లాడడం లేదని యువకుడు యువతిని చంపాడు.. పబ్‌లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఉంది.. ఇటీవలే వేరే పబ్‌లో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. తనతో మాట్లాడడం లేదని అనుమానంతో ఆ యువకుడు ఆమెను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని బోరబండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు.. నిందితుడు జహీర్ జ్యూస్ సెంటర్‌లో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వెనుక నిర్మానుష్య ప్రదేశంలో ఖనిజ ఫాతిమాను జకీర్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న బస్తీకి వెళ్లి విషయం చెప్పాడు. బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫాతిమా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు చెప్తున్న దాని ప్రకారం హత్యకు యత్నించగా.. బాధితురాలు తప్పించుకుంది.. ఆ తర్వాత బండరాయితో మోది హత్యకు పాల్పడ్డాడు నిందితుడు . మరో యువకుడికి దగ్గరగా ఉండటంతో పగ పెంచుకున్న నిందితుడు.. ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

అసలు హత్య చేసిందా ఒక్కడేనా? మరెవరైన పాత్ర ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ అదుపులో ఉన్న నిందితుడి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.. జన సంచారానికి మూడు కిలో మీటర్ల దూరంలో జరిగిందీ ఘటన. మాట్లాడుదామని పిలిచి హత్య చేశాడా? లేక హత్య చేసేందుకు యువతిని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచాడా? ఇంతటి నిర్మానుష్య ప్రదేశానికి యువతి అసలు ఎందుకు వెళ్లిందన్న సందేహాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ ప్రశ్నలకు పోలీసు విచారణలో సమాధానం దొరికే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..